యుద్ధం వల్ల ఉక్రెయిన్‌కు వాటిల్లిన నష్టం 7.50 లక్షల కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

యుద్ధం వల్ల ఉక్రెయిన్‌కు వాటిల్లిన నష్టం 7.50 లక్షల కోట్లు

March 11, 2022

16

రష్యా చేస్తున్న దాడుల వల్ల ఉక్రెయిన్ ఆర్థికంగా భారీస్థాయిలో నష్టపోయింది. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆర్థిక సలహాదారు ఒలేగ్ ఉస్టెంకో ప్రకారం దాదాపు ఏడున్నర లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ఓ సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ కార్యక్రమంలో పాల్గొన్న ఉస్టెంకో.. యుద్ధం కారణంగా 50 శాతం వాణిజ్య కార్యకలాపాలు మూసివేతకు గురి కాగా, మిగిలినవి మందకొడిగా సాగుతున్నాయని
వెల్లడించారు. యుద్ధానికి ముందు ఫారెక్స్ నిల్వలు 30 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఇప్పుడు 27. 50 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయని వ్యఖ్యానించారు. నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారనే ప్రశ్నకు విదేశాల్లో స్తంభించిన రష్యా ఆస్తుల నుంచి రాబడతామని పేర్కొన్నారు. దేశంలో ఉన్న విదేశీ పౌరుల తరలింపులో చర్చల ద్వారా నిర్ణయించిన మానవతా కారిడార్ల ఏర్పాటుకు సైతం రష్యా సహకరించడం లేదని ఉస్టెంకో ఆరోపించారు.