Ukraine Requests Russian Mothes to call back there soldiers childrens
mictv telugu

తల్లులారా మీ బిడ్డలను తీసుకెళ్లండి: ఉక్రెయిన్

March 4, 2022

Ukraine Requests Russian Mothes to call back there soldiers childrens

ఉక్రెయిన్ దేశంలో బందీలుగా ఉన్న మీ బిడ్డలను వచ్చి తీసుకుపోండి అంటూ రష్యా దేశ తల్లులకు ఉక్రెయిన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘మీ బిడ్డలు మా దేశంలోకి అక్రమంగా చొరబడ్డారు. మా సైనికులు వారిని బందీలుగా ఉంచారు. వచ్చి తీసుకెళ్లండి’ అంటూ ప్రకటించింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా చేస్తున్న దాడులతో ఉక్రెయిన్‌లోని ఎన్నో బిల్డింగులు ధ్వంసమవుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ సైన్యం కూడా రష్యా బలగాలను దీటుగా ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో రష్యా సైనికులు ఉక్రెయిన్ బలగాలు బందీలుగా చిక్కుతున్నారు.

ఈ సందర్భంగా ఉక్రెయిన్ తమకు పట్టుబడిన రష్యన్ సైనికులను వారి తల్లులకు అప్పగించేందుకు సంసిద్ధం అయింది. ఉక్రెయిన్‌కు వచ్చి మీ పిల్లలను తీసుకెళ్లాలని తెలిపింది. తల్లులు వస్తే వారి పిల్లలను అప్పగిస్తామని చెప్పింది. తాము ఉక్రెయిన్ పౌరులమని, తమది పుతిన్ లా ఫాసిస్టు ఆలోచనాధోరణి కాదని తెలిపింది. తల్లులు, వారి బిడ్డలపై తాము యుద్ధం చేయమని స్పష్టం చేసింది.