రూ.7లక్షలను పోగేసిన ఉక్రెయిన్ పిల్లి.. ఎందుకంటే? - MicTv.in - Telugu News
mictv telugu

రూ.7లక్షలను పోగేసిన ఉక్రెయిన్ పిల్లి.. ఎందుకంటే?

April 1, 2022

pilli

ఉక్రెయిన్ దేశంపై రష్యా దేశ బలగాలు దాదాపు 36 రోజులు దాడి చేశాయి. ఈ దాడి కారణంగా ఉక్రెయిన్ దేశం అల్లకల్లోలం అయింది. వేలమంది ప్రజలు బాంబుల మోతకు భయపడి ఉక్రెయిన్‌ను విడిచి వెళ్లిపోయారు. మరికొంతమంది దేశంపై ఉన్న అభిమానంతో ఉక్రెయిన్‌లోనే ఉంటూ రష్యా బలగాలకు ఎదురుతిరిగారు. ఈ నేపథ్యంలో ఒక చిన్నారి రష్యా సైనికుడిపై విరుచుకుపడింది. ఇక్కడకు ఎందుకొచ్చావంటూ కేకలు వేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు ఓ ఉక్రెయిన్‌ రైతు ర‌ష్యాకు చెందిన ఓ మిలట్రీ ట్యాంకునే ట్రాక్ట‌ర్‌తో ఈడ్చుకెళ్లి, తన దేశంపై అతనికున్న భక్తిని చాటుకున్నాడు. ఇలా ఉక్రెయిన్ దేశ ప్రజలు రష్యా బలగాలకు పలు రకాలుగా ఎదురుతిరిగారు.

ఇటువంటి సమయంలో మనుషులే కాదు జంతువులు సైతం ఉక్రెయిన్ దేశకోసం వాటివంతు సహాయం చేయడం కోసం ముందుకొచ్చాయి. ఓ పిల్లి ఉక్రెయిన్ దేశం కోసం విరాళాలను సేకరించిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దాని పేరు స్టెపాన్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ మార్జాలం. అందరూ ముద్గుగా చిల్ క్యాట్ అంటారు. రష్యా చేస్తున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ చాలా నష్టపోయింది. సామాన్య ప్రజలు, పిల్లలు చనిపోయారు. వారితోపాటూ, జంతువులు, పక్షులు కూడా చనిపోయాయి. మరికొన్ని గాయాలపాలయ్యాయి. వాటిని ఆదుకునేందుకు స్టెపాన్ (పిల్లి) విరాళాలు సేకరించింది. ఇప్పటివరకూ ఈ పిల్లి రూ.7 లక్షలకు పైగా పోగేసింది.

ఈ నేపథ్యంలో యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి లక్షల మంది ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారు. చాలా మంది తమతో పెంపుడు జంతువుల్ని తీసుకెళ్లాలి అనుకున్నారు గానీ వీలు కాలేదు. ఎందుకంటే వాళ్లకే దిక్కు లేదు. ఇక వాటిని ఎలా తీసుకెళ్లగలరు. అలా యజమానుల్ని కోల్పోయిన మూగజీవాలు ఉక్రెయిన్‌లోనే ఉంటూ బాంబు దాడుల్లో గాయాలపాలవుతున్నాయి. వాటికి ఈ పిల్లి సాయం ద్వారా అదుకోబోతున్నారు. స్టెపాన్ పిల్లిని విదేశీయులు మీమ్స్‌లో బాగా వాడుతుంటారు. ఇది ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలో నివసించేది. దీనికి ఇన్‌స్టాగ్రామ్‌లో loveyoustepanపేజీ ఉంది. అందులో 12 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఈ కారణంగా ఆ పిల్లి రూ.7 లక్షల రూపాయలను వసూలు చేసింది.