Ukrainian citizens spray red ink on Russian ambassador
mictv telugu

వీడియో : రష్యా రాయబారికి చేదు అనుభవం

May 9, 2022

Ukrainian citizens spray red ink on Russian ambassador

రెండో ప్రపంచయుద్ధంలో విజయానికి గుర్తుగా రష్యా మే 9వ తేదీన విక్టరీ డే జరుపుకుంటుంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పుతిన్ పాల్గొని రష్యా చేస్తున్న పని సక్రమమైనదేనని సమర్ధించుకున్నారు. నాటోకి వ్యతిరేకంగా మాట్లాడారు.

ఇదే సమయంలో ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన పోలాండ్‌లో రష్యా రాయబారికి చేదు అనుభవం ఎదురైంది. విక్టరీ డే సందర్భంగా రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన సైనికులను నివాళులు అర్పించేందుకు పోలాండ్‌లో రష్యా రాయబారి సెర్గీ ఆండ్రియేవ్ సైనిక శ్మశానానికి వెళ్లగా, అక్కడ ఉంటున్న ఉక్రెయిన్ ప్రవాసీయులు ఆయనపై రెడ్ ఇంక్‌ చల్లారు. ఉక్రెయిన్ జెండాలు పట్టుకొని కొందరు వ్యక్తులు సిరా చల్లి తమ నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమం పెట్టుకోవద్దని రష్యా సూచించినా, సెర్గీ ధైర్యం ప్రదర్శించి వెళ్లగా, పై రకంగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం సోమవారంతో 75 రోజులు పూర్తి చేసుకుంది.