రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ నటుడు పాషా లీ (33) మరణించారు. ఈ మేరకు ఒడెసా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ధృవీకరించింది. పలు సినిమాల్లో నటించిన పాషా లీ క్రిమియాలో జన్మించాడు. ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ నేపథ్యంలో అధ్యక్షుడు జెలెన్స్కీ పిలుపు మేరకు ఆయుధం చేతపట్టి సైన్యంలో చేరాడు. కీవ్ సమీపంలోని ఇర్పిన్ ఏరియాలో దేశ సైనికులతో కలిసి పాషా లీ యుద్ధంలో పాల్గొన్నాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆదివారం రష్యా జరిపిన షెల్లింగ్‌లో మరణించాడు. కాగా, మరణానికి కొద్ది గంటల ముందు పాషా లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెడుతూ దేశం కోసం ఎంత కష్టమైనా సంతోషంగా భరిస్తామని వెల్లడించాడు.