Ukrainian refugee who loved Britain family men
mictv telugu

బ్రిటీష్ కాపురంలో చిచ్చుపెట్టిన ఉక్రెయిన్ శరణార్ధి

June 27, 2022

భార్యాభర్తల మధ్య మూడో మనిషి వస్తే ఎలా ఉంటుందో మన సమాజంలో తరచూ చూస్తూనే ఉంటాం. కానీ, పోనీలే పాపం అని ఆశ్రయం ఇచ్చిన ఓ యువతి, తిన్నింటి వాసాలు లెక్కపెట్టింది. శరణార్ధిగా ఉంటూ భర్తను వల్లో వేసుకుంది. పైగా నీతులు చెప్తోంది. బ్రిటన్‌లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రష్యా – ఉక్రెయిన్ యుద్ధంతో చాలా మంది ఉక్రెయిన్లు వలస వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా యూరప్ ఖండంలోని దేశాలకు ఎక్కువ మంది వెళ్తున్నారు. ఈ క్రమంలో 22 ఏళ్ల సోఫియా అనే ఉక్రెయిన్ అమ్మాయి బ్రిటన్‌కు శరణార్ధిగా వెళ్లింది. అక్కడ అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలున్న 29 ఏళ్ళ టోనీ అనే వ్యక్తి ఇంట్లో చేరింది. అయితే సోఫియా చేరిన 10 రోజులకే టోనీ కాపురంలో కలతలు మొదలయ్యాయి. సోఫియా టోనీని వెంటేసుకుని తిరగడం మొదలెట్టింది. టోనీ కూడా సోఫియాకు మద్ధతుగా ఉండి ఆమెతో సరసాలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ పరిస్థితిని గమనించిన టోనీ భార్య ఇంట్లో గొడవ చేయడం ప్రారంభించింది. దీంతో విసిగిపోయిన టోనీ సోఫియాను తీసుకెళ్లి తన తల్లితండ్రుల వద్దకు వెళ్లిపోయాడు. ఈ విషయం అక్కడి మీడియాలో హైలెట్ కావడంతో అందరూ సోఫియాను విమర్శించడం మొదలెట్టారు. దీనికి బదులుగా ‘టోనీ తన కుటుంబంతో సంతోషంగా ఉండి ఉంటే కేవలం పది రోజుల్లో నాతో ప్రేమలో పడేవాడా? 29 ఏళ్లున్న టోనీకి తన సంతోషం కోసం ప్రేమలో పడే హక్కుంది. దానిని కాదనడానికి మీరెవరు? అని ప్రశ్నిస్తోంది. అంతేకాక, ఎవరు ఏమనుకున్నా మేము ప్రస్తుతం హ్యాపీగా ఉన్నామని స్టేట్‌మెంట్ ఇస్తోంది. అయితే టోనీ పిల్లల సంగతేంటి? అని అడిగితే కరెక్టుగా జవాబివ్వడం లేదు. కాగా, ఈ రిలేషన్ గురించి మరో విషయం బయటపడింది. టోనీ సోఫియాల పరిచయం కేవలం పది రోజుల్లో జరిగింది కాదంట. ఉక్రెయిన్‌లో ఉండగానే వీరిద్దరు సోషల్ మీడియా ద్వారా తరచూ మాట్లాడుకునే వాళ్లంట. దీంతో శరణార్ధి పేరుతో సోఫియా నేరుగా టోనీ ఇంటికి వచ్చేసిందనే ప్రచారం జరుగుతోంది.