కొంతమంది తుమ్మినా…దగ్గినా..ట్యాబ్లెట్ వేసుకుంటారు. తలనొప్పి, కాళ్లనొప్పులు ఇలా ఏదైనా సరే ప్రతిదానికి యాంటీబయాటిక్స్ వాడేవారు మనలో చాలామందే ఉన్నారు. వాస్తవానికి యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడినట్లయితే…కడుపు, ప్రేగులకు సంబంధించిన ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చలికాలంలో చాలామంది ఊపిరితిత్తులు, ఉదర వ్యాధులతో బాధపడతుంటారు. అయితే ఈ ఏడాది జనవరి మొదటివారంలో 20లక్షలకు పైగా యాంటీబయాటిక్స్ అమ్ముడయ్యాయని ఓ వార్తపత్రిక నివేదిక పేర్కొంది. అంటే ఏడాది మొత్తం అమ్ముడుపోని యాంటీ బయాటిక్స్ కేవలం ఈ నెల ప్రారంభంలోనే అమ్ముడయ్యాయి. కానీ యాంటీబయాటిక్స్ వాడటం ఎంతవరకు సురక్షితం. ఇది ఆలోచించాల్సిన విషయం. ఈ మధ్యే బీఎంజే గట్ జర్నల్లో ప్రచురించిన ఈ నివేదికలు యాంటీబయాటిక్స్ అతిగా వినియోగించడం వల్ల తీవ్రమైన వ్యాధులకు గురికావాల్సి వస్తుందని సూచించాయి. అంతేకాదు 40ఏళ్లు దాటిని వారికి ఇది డేంజర్ బెల్ లాంటిది.
40 ఏళ్లలోపు వారు జాగ్రత్తగా ఉండాలి
వాస్తవానికి, BMJ గట్ జర్నల్లో ప్రచురించిన ఈ పరిశోధనలో, 2000 నుండి 2018 వరకు 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల నుండి డేటా సేకరించింది. ఈ అధ్యయనంలో 61 లక్షల మంది పాల్గొన్నారు. 55 లక్షల మంది యాంటీబయాటిక్స్ తీసుకున్నారు. వీటిలో ఎక్కువ భాగం కడుపు సమస్యలతో ప్రజలను ఇబ్బంది పడుతున్నావారే. దీనికారణంగా అనేక ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయి.
40 ఏళ్ల తర్వాత చాలా యాంటీబయాటిక్స్ దుష్ప్రభావాలు
40 ఏళ్ల తర్వాత యాంటీబయాటిక్స్ వల్ల ఈ వ్యక్తుల్లో చాలా ప్రతికూలతలు కనిపిస్తాయని కూడా ఈ పరిశోధనలో చెప్పబడింది. ఉదాహరణకు, దీని వినియోగం కడుపులోని గట్ బ్యాక్టీరియాను దెబ్బతీస్తుంది. ఇది వ్రణోత్పత్తి పెద్దప్రేగు శోథకు కారణమవుతుంది. అల్సరేటివ్ పెద్దప్రేగు శోథ అనేది మీ జీర్ణవ్యవస్థలో మంట పుండ్లు కలిగించే ఒక తాపజనక ప్రేగు వ్యాధి.ఇది వ్రణోత్పత్తి పెద్దప్రేగు శోథ మీ పెద్ద ప్రేగు లోపలి పొరను ప్రభావితం చేస్తుంది. కాబట్టి 40ఏళ్లు పై బడినవారు యాంటీబయాటిక్స్ ను వీలైనంత వరకు తగ్గించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ..పండ్లు, కూరగాయలతో వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.