అయోధ్యకు వెళ్తా.. భూమి పూజలో పాల్గొనను : ఉమా భారతి - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్యకు వెళ్తా.. భూమి పూజలో పాల్గొనను : ఉమా భారతి

August 3, 2020

Uma Bharti Skip Ayodya Bhoomi Pujan Event

అయోధ్యలో భూమి పూజ  కార్యక్రమానికి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అత్యంత ప్రముఖుల మధ్యలోనే ఇది జరగనున్న నేపథ్యంలో ఆహ్వానం వచ్చినా కూడా బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి దూరంగా ఉంటానని సోమవారం ప్రకటించారు. అయోధ్యకు వెళ్లినా కూడా తాను భూమి పూజ జరిగే సమయంలో అక్కడికి వెళ్లడం లేదని ట్వీట్ చేశారు. సరయూ నది తీరంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నిబంధనల ప్రకారమే తాను దూరంగా ఉంటున్నానని పేర్కొన్నారు. అందరూ వెళ్లిపోయిన తర్వాత ఆ స్థలాన్ని దర్శించుకుంటానని స్పష్టం చేశారు.

ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా ఇతర నాయకులకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో మోదీ సహా తాను కూడా ఆందోళన చెందామని చెప్పారు. అందుకే 61 ఏళ్ల వయసున్న తాను వెళ్లకూడదని అనుకుంటున్నానని తెలిపారు. అక్కడికి వచ్చే వారు, ప్రధాని ఆరోగ్యం దృష్ట్యా మాత్రమే తాను దూరంగా ఉంటున్నానని వెల్లడించారు. వేరే కారణాలేమి లేవని స్పష్టం చేశారు. తాను భోపాల్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు రైలులో ప్రయాణిస్తానని చెప్పుకొచ్చారు. కాగా ఇప్పటికే ఆమెను అతిథుల జాబితా నుంచి దూరంగా ఉంచాలని ట్రస్ట్ సభ్యులకు తెలిపిన సంగతి తెలిసిందే.

అయోధ్యలో రామ మందిరం కోసం బాబ్రీ మసీదును కూల్చివేసిన కేసులో ఉమా భారతి కూడా ఉన్నారు. ఇప్పటికే బీజేపీ కుర వృద్ధులు ఎల్.కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఈ కార్యక్రమం వీక్షించనున్నారు. వీరి వయసు రిత్యా అయోధ్యకు వెళ్లే అవకాశం లేకపోయింది.