కరోనా బారిన పడ్డ ఉమా భారతి.. మూడు రోజుల్లో తీర్పు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా బారిన పడ్డ ఉమా భారతి.. మూడు రోజుల్లో తీర్పు

September 27, 2020

MCFNB

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆమె ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘గత మూడు రోజులగా జ్వరంతో బాధపడుతున్నాను. ఇటీవల హిమాలయాలకు వెళ్లినపుడు కరోనా వైరస్‌ నిబంధనలను పాటించినప్పటికీ కరోనా వైరస్‌ సోకింది. గత కొన్ని రోజుల్లో తనను కలిసిన వారు కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, హోం ఐసోలేషన్‌లో ఉండాలి. ప్రస్తుతం నేను హరిద్వార్‌, రిషికేశ్‌ మధ్య ఉన్న వందేమాతరం పర్వత శిఖరం వద్ద క్వారంటైన్‌లో ఉన్నాను. నాలుగు రోజుల తర్వాత మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటాను.’ అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పు ఈనెల 30న లక్నో లోని సిబిఐ ప్రత్యేక కోర్టు వెలువరించనుంది. ఈ కేసులో బీజేపీ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, అప్పటి ఉత్తరప్రదేశ్ సీఎం కళ్యాణ్ సింగ్, వినయ్‌ కటియార్, స్వాధి రితంబరలతో పాటు ఉమాభారతి పేరు కూడా ఉంది. ఈ కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 30న తీర్పు వెల్లడించనుంది. ఈ కేసుని విచారిస్తున్న లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌కే యాదవ్‌ తీర్పు వెలువడే 30వ తేదీన నిందితులు అందరూ కోర్టుకి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ బారిన పడడంతో ఉమా భారతి హాజరు అవుతారా లేరా అనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.