Uma Bharti throws cow dung at liquor shop in Madhya Pradesh
mictv telugu

లిక్కర్ షాప్‌పై ఆవు పేడ విసిరిన మాజీ సీఎం

June 15, 2022

Uma Bharti throws cow dung at liquor shop in Madhya Pradesh

మద్యపాన నిషేధం చేయాలంటూ చాలాకాలంగా ఆందోళన చేస్తున్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఓ మద్యం దుకాణంపై ఆవు పేడ విసిరి తన నిరసనను కాస్త బలంగా వ్యక్తపరిచారు. నివారి జిల్లాలోని ఓర్చా పట్టణంలో ఉన్న ఒక మద్యం దుకాణంపై ఆవు పేడ విసురుతూ మద్య నిషేధం చేయాలని ఆమె నినాదాలు చేశారు. ఆ మద్యం దుకాణం ఏర్పాటు చేసిన స్థలానికి అనుమతి లేదని, ఎంతో పవిత్ర నగరమైన ఓర్చాలో ఇలాంటి దుకాణం తెరవడం నేరమంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో తీసిన వ్యక్తితో ‘‘చూడండి.. నేను ఆవుపేడ విసిరాను.. రాళ్లు రువ్వలేదు’’ ఆమె అన్నట్టుగా రికార్డయింది. ఈ ఏడాది మార్చిలో భోపాల్‌లోని ఓ మద్యం దుకాణంపై రాళ్లతో దాడి చేసిన వీడియోలు అప్పట్లో వైరలైన సంగతి తెలిసిందే.