కేసీఆర్‌తో ఉమ, సందీప్‌రెడ్డి భేటీ.. 14న తీర్థం - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌తో ఉమ, సందీప్‌రెడ్డి భేటీ.. 14న తీర్థం

December 12, 2017

తెలంగాణలో టీడీపీకి మరో గట్టి దెబ్బ తగలనుంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే మరో ఇద్దరు నేతలు పార్టీ నుంచి ఫిరాయించడానికి సిద్ధమయ్యారు. టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి, ఆమె కొడుకు, భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరడం ఖాయమైంది.వీరు మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తాము ఇకనుంచి ఆయన నాయకత్వంలో నడుస్తామని చెప్పారు. ఈ నెల 14న గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఉమ, సందీప్ తమ అనుచరుల గణంతో కలసి కేసీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్‌లో గులాబీ కండువా కప్పుకుంటారు. దీని కోసం సందీప్ రెడ్డి టీడీపీకి ఇప్పటికే రాజీనామా చేసినట్లు వార్తుల వస్తున్నాయి. టీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానిస్తే ఆలోచిస్తానని ఉమ ఇదివరకే చెప్పారు. తనకు టికెట్ ఇస్తారనే హామీ ఇచ్చి ఉంటే రేవంత్ రెడ్డితోపాటు అప్పుడే ఢిల్లీ విమానమెక్కి కాంగ్రెస్ లో చేరేదానినని కూడా అన్నారు.