పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ కు ఫ్యాన్స్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. ట్వట్టర్ పోస్టింగ్ కు లైక్ వస్తాయనుకుంటే….తిట్ల వర్షం కురిస్తోంది.
Enjoying London after hard work pic.twitter.com/N6U05mgAse
— Umar Akmal (@Umar96Akmal) July 13, 2017
కొంత కాలంగా ఫామ్ కోసం ట్రై చేస్తూ టీమ్‌లో స్థానం కోల్పోయిన అక్మల్.. ప్రస్తుతం లండన్‌లో చక్కర్లు కొడుతున్నాడు. టీమ్‌లో ప్లేసే కాదు.. ఈ మధ్య పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రిలీజ్ చేసిన నేషనల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లోనూ ఉమర్ అక్మల్ పేరు లేదు. ఈ టైమ్ లో ఓ కాస్ట్‌లీ బెంట్లీ కారు పక్కన నిలపడి ఫొటో దిగిన ఉమర్ అక్మల్.. దానిని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. హార్డ్‌వర్క్ చేసిన తర్వాత లండన్‌లో ఎంజాయ్ చేస్తున్నా అని కామెంట్ పెట్టాడు. ట్విట్టర్‌లో ఫ్యాన్స్ సీరియస్‌గా రియాక్టయ్యారు. అసలు ఏం హార్డ్‌వర్క్ చేశావని ఎంజాయ్ చేయడానికి అని కొందరంటే.. అంత కాస్ట్‌లీ కారు నీకెక్కడిది ఇంకొందరు నిలదీశారు.