లావుగా ఉన్నానని.. - MicTv.in - Telugu News
mictv telugu

లావుగా ఉన్నానని..

September 6, 2017

కేంద్రంలోని మోదీ కేబినెట్ లో ఇటీవల చేసిన మార్పులపై కొందరు మంత్రులు అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఉమా భారతిని జలవనరుల శాఖ నుంచి ప్రాధాన్యం లేని పారిశుధ్య, తాగునీటి శాఖకు మార్చడం తెలిసిందే. దీనిపై ఆమె కాస్త ఘాటుగా, కాస్త గందరగోళంగా స్పందించారు. ‘మోదీ నా పనితీరు నచ్చక శాఖను మార్చలేదు. నేను లావుగా ఉన్నానన్న ఒకే ఒక్క కారణంతోనే బాధ్యతలు మార్చారు. అయినప్పటికీ నేను గంగానది ప్రక్షాళన విషయంలో రాజీపడను. దీని కోసం వచ్చే నెల నుంచి నేను పాదయాత్ర చేస్తాను. నన్ను వేరే శాఖకు మార్చినంత మాత్రాన నా పనితీరు బాగాలేదని అర్థం చేసుకోకూడదు. ’ అని ఉమా భారతి చెప్పారు. మోదీ మహిళాసాధికారతకు పట్టం కడుతున్నారనీ చెప్పుకొచ్చారు. శాఖ మార్పుకు లావుగు ఉండటానికి మధ్య సంబంధం ఏమిటో ఆమె చెప్పలేదు.