బుమ్రాకు గాయం..టీమిండియాకు ఎదురుదెబ్బ - MicTv.in - Telugu News
mictv telugu

బుమ్రాకు గాయం..టీమిండియాకు ఎదురుదెబ్బ

September 24, 2019

Bumrah .......

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. దీంతో దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడు. బుమ్రా వీపు కింది భాగంలో స్వల్ప పగులు ఉన్నట్టు వైద్యపరీక్షల్లో తేలింది. గాయం మరీ తీవ్రతరం కాకుండా ఉండేందుకు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ నుంచి బుమ్రాకు విశ్రాంతి కల్పించారు.

బుమ్రా 7 నుంచి 8 వారాల పాటు జట్టుకి దూరంగా ఉండనున్నాడు. బుమ్రా స్థానంలో ఉమేశ్ యాదవ్‌ జట్టులోకి రానున్నాడు. ఇటీవలే వెస్టిండీస్ పర్యటనలో బుమ్రా అద్భుతమైన రీతిలో వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు బుమ్రా గాయపడడంతో ప్రధాన బౌలర్ లేకుండానే టీమిండియా బరిలో దిగనుండనుంది. ఈ ప్రభావం భారత విజయాకాశాలపై చూపొచ్చని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు.