యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ప్రస్తుత భారతదేశంలో వేగవంతమైన బౌలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. భారత్ జట్టులో 150కి.మీ వేగాన్ని అందుకుని బౌలింగ్ చేసే అతి తక్కువ మందిలో ఉమ్రాన్ ఒకడు. బుల్లెట్లా దూసుకొచ్చే అతని బంతులు బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడతాయి. నిర్ధిష్టమైన వేగం, లెంగ్త్‌తో బౌలింగ్ చేసి ఉమ్రాన్ టీం ఇండియాలో చోటు సంపాదించుకొని పర్వాలేదనిపిస్తున్నాడు.
Umran Malik on Fire🔥
Umran malik took wicket of Dashun Shanaka by bowling at 155 Km.. OMG! #UmranMalik #INDvSL pic.twitter.com/yqVeADBUxV— NAFISH AHMAD (@nafeesahmad497) January 3, 2023
తాజాగా బుధవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ రాణించాడు. 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ప్రధానంగా శ్రీలంక కెప్టెన్ శనక వికెట్ తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. 27 బంతుల్లో 45 పరుగులు చేసి మంచి టచ్‌లో ఉన్న శనకను ఉమ్రాన్ బోల్తా కొట్టించాడు. ఏకంగా 155 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరి అతడిని ఔట్ చేశాడు. ఈ బంతిని షణక గట్టిగా బాదగా.. అది వెళ్లి యుజ్వేంద్ర చాహల్ చేతుల్లో పడింది. ఈ క్రమంలోనే భారత్ తరఫున అత్యధిక వేగంతో బంతి విసిరిన బౌలర్‌గా ఉమ్రాన్ రికార్డు సృష్టించాడు. జస్ప్రీత్ బుమ్రా(155.3కి.మీ) పేరిట ఉన్న రికార్డును బద్దలగొట్టాడు.
ఇక అక్తర్ రికార్డుపై కన్నేసిన ఉమ్రాన్ మాలిక్ త్వరలోనే ఆ రికార్డును అధిగమిస్తానని ఇటీవల చెప్పాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్తర్ ఓ బంతిని గంటకు 161.3 కి.మీ వేగంతో విసిరాడు.
ఇదే ఇప్పటి వరకు అత్యంత వేగవంతమైన బాల్‌గా రికార్డుల్లో ఉంది. ఉమ్రాన్ మాలిక్ ఇదే వేగాన్ని కంటిన్యూ చేసి రాణిస్తే..తొందరలోనే అక్తర్ రికార్డు చెరిగిపోయే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
భారత్ Vs శ్రీలంక టీ20: ఇషాన్ కిషన్ సూపర్ క్యాచ్
రూ.500 విత్ డ్రా చేస్తే రూ.2500.. ఎగబడ్డ జనం
కాళేశ్వరానికి డీపీఆరే లేదు.. ఎన్ని సార్లు డిజైన్ మార్చిర్రు..ఎవరికోసం మార్చిర్రు.. అన్ని తెలుసు మాకు