బంగ్లాదేశ్‌తో మొదట వన్డేలో ఓటమి చవిచూసిన భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. టీంఇండియా మరో బౌలర్ గాయం కారణంగా రెండో వన్డేకు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సిరీస్‌కు గాయం కారణంగా షమీ దూరం కాగా..ఇప్పుడు శార్దుల్ ఠాకూర్ కూడా గాయపడ్డాడనే వార్త ఆందోళన కలిగిస్తుంది. తొడ కండరాలు పట్టేయడంతో శార్దుల్ ఇబ్బంది పడుతున్నాడు. మొదటి వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో గాయపడిన శార్దుల్కి వైద్య పరీక్షలు నిర్వహించి అందుబాటులో ఉండే విషయమై ఓ నిర్ణయానికి రానున్నారు. రెండో వన్డే సమయానికి అతడు అందుబాటులో లేకపోతే ఉమ్రాన్ మాలిక్‌ను ఆడించే ఛాన్స్ ఉంది. ఇక గాయం కారణంగా ఇప్పటికే వన్డే సిరీస్‌కు దూరమైన షమీ టెస్ట్ సిరీస్ నాటికి అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో మధ్యాహ్నం 12 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. మొదటి వన్డేలో ఓడిన భారత్‌కు రెండో వన్డే కీలకం కానుంది. సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచులో రోహిత్ సేన తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు చివరి రెండు వన్డేలను గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని బంగ్లాదేశ్ చూస్తోంది.