శ్రీలంకతో జరుగుతున్న మొదటి వన్డేలో టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ కొత్త రికార్డును నమోదు చేశాడు. ఇండియా తరపున అత్యంత ఫాస్టెస్ట్ డెలివరీ వేసిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తాను వేసిన రెండో ఓవర్ అంటే ఇన్నింగ్స్ 14వ ఓవర్ నాలుగో బంతిని 156 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. అటు ఐపీఎల్ లో కూడా ఉమ్రాన్ పేరిటే రికార్డు ఉంది. 157 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతే ఇప్పటివరకు రికార్డుగా ఉంది.
Fastest delivery in IPL, T20I Int'l, ODIs for India in the history – Umran Malik. pic.twitter.com/h0hFwsvQRg
— CricketMAN2 (@ImTanujSingh) January 10, 2023
కాగా, 14వ ఓవర్ లో ఉమ్రాన్ వేసిన బంతులకు లంక బ్యాటర్ అసలంక వణికిపోయాడు. ఈ ఓవర్లో వరుసగా 147, 151, 156, 146, 145 వేగంతో విసిరిన బంతులకు సమాధానమే లేకుండా పోయింది. చివరికి చివరి బంతికి కీపర్ క్యాచ్ గా వెనుదిరిగాడు. అయితే రిప్లేలో మాత్రం బంతి బ్యాట్‌కు తాకినట్టు కనపడలేదు. అతని ప్యాడ్స్‌ని తాకుతూ కీపర్ చేతిలో పడగా, తాకినట్టు భావించి అసలంక క్రీజును వదిలాడు. మొత్తానికి ఈ మ్యాచులో ఇండియా విజయం దిశగా వెళ్తోంది. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 38 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసింది. ఇంకా ఆ జట్టు విజయానికి 12 ఓవర్లలో 167 పరుగులు కావాలి. ఇది దాదాపు అసాధ్యం కాబట్టి భారత్ విజయం ఖాయమైనట్టే.
Charith Asalanka walked off despite the ball hitting the towel#INDvSL #UmranMalik #CharithAsalanka pic.twitter.com/1dcpYGFGPg
— CricShiva (@shivauppala93) January 10, 2023