బంగ్లాదేశ్‌ను ఢీ కొట్టేందుకు భారత్ సిద్ధమైంది. మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు ఆటగాళ్లు రెఢీ అయ్యారు. ఆదివారమే మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ సమయంలో భారత్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. గాయం కారణంగా టీం ఇండియా పేసర్ మహమ్మద్ షమీ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రాక్టిస్‌లో షమీ చేతికి తీవ్ర గాయం కావడంతో అతడు జట్టు నుంచి వైదొలిగినట్టు బీసీసీఐ తెలిపింది. వన్డే సిరీస్‌తో పాటు టెస్ట్ సిరీస్ ఆడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెస్ట్ సిరీస్ ఆడటంపై ఇంకా క్లారిటీ రాలేదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియా..బంగ్లాదేశ్ తో జరగనున్న రెండు టెస్ట్‌లు గెలవాలి. ఈ సమయంలో సీనియర్ బౌలర్ షమీ గాయపడడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా గాయంతో తప్పుకోవడంతో ఇబ్బందుల్లో పడిన భారత్..ఇప్పుడు షమీ దూరమైతే భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలనట్టే..ఇక వన్డే సిరీస్‌కు దూరమైన షమీ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి రానున్నాడు.
మూడు వన్డేల సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఢాకాలోని షేర్ ఈ బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. తొలి వన్డే ఆదివారం జరగనుండగా.. రెండో వన్డే డిసెంబర్ 7న, మూడో వన్డే డిసెంబర్ 10న జరగనుంది. మూడు వన్డే మ్యాచ్‌లు భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
బంగ్లాదేశ్‌తో వన్డేలకు భారత్ జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషాన్(వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్