తమ దేశం పేరుపై టర్కీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కొత్త పేరుతో తమను గుర్తించాలని ఐరాసకు టర్కీ విదేశాంగ మంత్రి ప్రతిపాదన పంపారు. దీనికి ఐరాస కూడా అంగీకారం తెలిపింది. టర్కీకి బదులు ‘తుర్కియా’ అనే పేరు మార్పు తక్షణమే అమల్లోకి వస్తుందని యూఎన్ చీఫ్ ప్రకటించారు. పేరును మార్చాలంటూ.. ఆ దేశాధ్యక్షులు రెచప్ తయ్యప్ ఎర్దోవాన్ పలు ప్రయత్నాలు చేశారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలను ఆయన ఆశ్రయించారు. ‘తుర్కియా’ అనే పదం దేశానికి చక్కగా సరిపోతుందని.. ఎందుకంటే.. తుర్కుల సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత, విలువలకు అద్దం పడుతుందని ఎర్జోవాన్ చెబుతూ వస్తున్నారు. టర్కీ అనే పేరు ఒక పక్షికి ఉండటంతోపాటు “దారుణంగా విఫలమైనది లేదా మతిలేని వ్యక్తి”అనే అర్థాలు దీనికి ఇంగ్లీష్ లో ఉన్నాయి. దీంతో పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో టర్కీ దేశం పేరు ఇక చరిత్ర కానుంది.