జియో సిగ్నల్స్‌ను ఆపలేకపోతున్నాం..కోర్టుకు జైలు అధికారులు - MicTv.in - Telugu News
mictv telugu

జియో సిగ్నల్స్‌ను ఆపలేకపోతున్నాం..కోర్టుకు జైలు అధికారులు

February 5, 2020

 

 

gbhbhn

తీహార్‌ జైల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపిస్తూ జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ ఖైదీ 2018లో ఢిల్లీ హైకోర్టుకు లేఖ రాశారు. ‘జైలు అధికారులు డబ్బులు తీసుకుని ఖైదీలకు డ్రగ్స్‌ సరఫరా చేయడమే కాకుండా మొబైల్‌ ఫోన్స్‌, ఇతర నిషేధిత వస్తువులు సరఫరా చేస్తున్నారు.’ అని ఆ వ్యక్తి లేఖలో ఆరోపించారు. దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు.. ఓ జడ్జిని నియమించి జైల్లో పరిస్థితుల మీద విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా కోరింది. విచారణ జరిపిన జడ్జి 2019 ఏప్రిల్‌లో తన రిపోర్ట్‌ను కోర్టుకు అందజేశారు. లేఖలో ఆరోపించిన విధంగానే జైలు లోపల నిషేధిత వస్తువులు ఉన్నాయని తెలిపారు.

దీనిపై స్పందించిన జైలు అధికారులు.. తమ వద్ద ఉన్న సాంకేతికతో తీహార్‌ జైలు లోపల మొబైల్‌ సిగ్నల్స్‌ను నిరోధించలేకపోతున్నామని కోర్టుకు తెలిపారు. ముఖ్యంగా జియో 4జీ సిగ్నల్స్‌ను నిరోధించడం సాధ్యం కావడం లేదన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రోటోటైప్‌ జామర్‌ను అభివృద్ధి చేయాల్సిందిగా సీ-డాట్‌ను కోరినట్టు వివరించారు. అలాగే ఈసీఐఎల్‌ అందజేసిన జామర్ల ద్వారా మొబైల్‌ సిగ్నల్స్‌ను నిరోధించడానికి ప్రయత్నించినట్టు రాహుల్‌ కోర్టుకు తెలిపారు. జైలు లోపల మొబైల్ ఫోన్‌ల అక్రమ వినియోగాన్ని అరికట్టడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం అన్వేషిస్తున్నట్టు చెప్పారు. తరువాత కోర్టు ఈ కేసు విచారణను ఏప్రిల్‌ 28కి వాయిదా వేసింది.