వావ్.. బుల్లోడి ఫుట్‌బాల్‌ ఆట చూసి తీరాల్సిందే.. - MicTv.in - Telugu News
mictv telugu

వావ్.. బుల్లోడి ఫుట్‌బాల్‌ ఆట చూసి తీరాల్సిందే..

July 11, 2020

Football.

కొందరు పిల్లలు తల్లి కడుపులోనే అన్నీ నేర్చుకుని వచ్చినట్టు పుట్టగానే నైపుణ్యం ప్రదర్శిస్తారు. ఈ బుడతలు అలాంటివాడే. ఫుట్‌బాల్‌ను ఎంతో చాకచక్యంగా ఓ ఆట ఆడుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం పంచుకున్నారు.  ఈ వయసులో నమ్మశక్యం కాని నైపుణ్యం అంటూ ఆ బుడ్డోడికి ఫిదా అయిపోయారు. దీంతో ఈ వీడియో బాగా వైరల్‌గా మారింది. బాలుడు కిక్-అప్స్ చేయడం ఎందరో నెటిజన్లును విపరీతంగా అలరిస్తోంది. ఇంత చిన్న వయసులో ఆ చిన్నోడు  బాల్‌‌తో ఆడుతున్న తీరుకు ఎందరో ముగ్ధులు అవుతున్నారు. 

బాల్‌ను ఎంతో ఒడుపుగా రెండు కాళ్లతో ఆడుకున్నాడు. బాల్ కింద పడుతున్న సమయంలో అతను చూపిన చొరవ వహ్వా అనిపించకమానదు. ‘వీడు భవిష్యత్తులో పెద్ద ఛాంపియన్ అవుతాడు’ అని నెటిజన్లు లవ్ ఎమోజీలు పంచుకుంటున్నారు. ‘అతని తల్లిదండ్రలు ఈ బుడతడిని బాగా ప్రోత్సహించి ఫుట్‌బాల్ ఆటగాడిని చేయాలి. భవిష్యత్తులో గొప్ప ఆడగాడు అవుతాడు’ అని మరో యూజర్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా, ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో అత్యంత  చురుగ్గా వుంటూ, విభిన్న వీడియోలతో ఆకట్టుకునే  హర్భజన్ ఇటీవల రాహుల్ ద్రావిడ్  అద్భుతమైన క్యాచుల వీడియో షేర్ చేసిన విషయం తెలిసిందే.