మనం ఆరోగ్యాంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. శరీరానికి తగిన మొత్తంలో పోషకాలు అందించే ఆహార పదార్థాల్లో ఒకటి బొప్పాయి. బొప్పాయిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా బొప్పాయిపండు తింటే జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాదు..కడుపు సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బొప్పాయి తింటే ఎర్ర రక్త కణాలు కూడా పెరుగుతాయి. పేగుల్లో ఉండే విష పదార్థాలను తొలగించడంలో ఎంతో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, పొటాషియం, మినరల్స్, కాపర్, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బొప్పాయితోనే కాదు బొప్పాయి గింజల్లోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుఉన్నాయి. బొప్పాయి గింజలను క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. మరి ఆ ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం.
గ్యాస్ట్రిక్ సమస్య
చాలామంది ఆహారం తీసుకోగానే కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటారు. కడుపులో అధిక గ్యాస్ వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. అలాంటప్పుడు బొప్పాయిని తీసుకుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో అధిక మొత్తంలో నీరు, ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఆపానవాయువు సమస్యను దూరం చేస్తుంది.
చర్మకాంతి కోసం
ఈ పండులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉండటం వల్ల చర్మం కాంతిని పెంచడంలో సహాయపడుతుంది.మరీ ముఖ్యంగా ఈ పండులో ఉండే లైకోపీన్ అనే సమ్మేళనం చిన్న వయసులోనే ముఖంపై కనిపించే ముడతలు, మచ్చలను తొలగించి ఎప్పటికీ యవ్వనంగా ఉంచుతుంది.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది
నారింజ, నిమ్మవంటి సిట్రస్ పండ్లలో కనిపించే విటమిన్ సి కంటెంట్ బొప్పాయి పండులో కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ పండును మితంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా శరీరం ఎదుర్కొనే చాలా ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
రుమటాయిడ్ సమస్య దూరమవుతుంది
ఇప్పటికే చెప్పినట్లుగా, ఈ పండులో విటమిన్ సి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తరచుగా కనిపిస్తాయి. అయితే ఈ పండును మితంగా తీసుకోవడం వల్ల కీళ్లనొప్పుల సమస్య చాలా త్వరగా తగ్గుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, తక్కువ విటమిన్ సి కంటెంట్ ఉన్న పండ్లు, కూరగాయలను తీసుకునే వారికి భవిష్యత్తులో కీళ్ళనొప్పులు వంటి ఎముక సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కడుపులో మంట:
బొప్పాయి గింజల్లో విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి కడుపులోని మంట, నొప్పిని తగ్గించడంలో సాయపడతాయి.
క్యాన్సర్:
బొప్పాయి గింజల్లో పాలీఫెనాల్స్.. అనేక రకాల క్యాన్సర్ల నుంచి శరీరాన్ని కాపాడుతాయి. అందుకోసం రోజూ 5 నుంచి 6 బొప్పాయి గింజలను తీసుకుని వాటిని చూర్ణంలా చేసి తింటే చాలా మంచిది. లేదా పొడిలా చేసి నీటిలో కలిపి కూడా తాగొచ్చు.
ఫుడ్ పాయిజన్:
బొప్పాయి గింజల రసాన్ని తాగడం వల్ల.. కడుపులో ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే ఎస్చెరిచియా కోలి వంటి ఇతర బ్యాక్టీరియాలు నాశనం అవుతాయి.