సెన్సార్ లేని ‘అర్జున్ రెడ్డి’ వచ్చేస్తున్నాడు!

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘అర్జున్ రెడ్డి తెలుగు రాష్ట్రాలను ఎంతగా షేక్ చేసిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ముద్దు సీన్లు, పచ్చిబూతులు ఉన్నాయని కొందరు విమర్శించినా మెజారిటీ ప్రజలు ఈ సినిమాకు ఫిదా అయిపోయారు. విజయ్‌కి బ్రహ్మరథం పట్టారు.  ఈ మూవీ సెన్సార్ కత్తెర కచకచలకుపోను 3 గంటల నిడివితో ఈ మూవీ విడుదలైంది. అయితే సెన్సార్ కాని సీన్లు కూడా చాలా నిడివిలో ఉన్నాయి. సెన్సార్ కాని అర్జున్ రెడ్డి ఈ నెల 13న అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో విడుదల కానున్నాడు. దీనికి ఇంగ్లిష్ సబ్ టైట్సిల్స్ కూడా ఉంటాయి. సెన్సార్ వేటు పడని ఘాటు ఘాటు సీన్లు, డైలాగులు.. మరెన్నో విశేషాలతో వస్తున్న అర్జున్ రెడ్డి మళ్లీ జనాన్ని ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. సెన్సార్ చేయని సీన్లతో అర్జున్ రెడ్డిని మళ్లీ థియేటర్లలో విడుదల చేసేందుకు మూవీ టీమ్ కసరత్తు చేయడం తెలిసిందే. మరి ఆ ప్రయత్నం ఎంతవరకు వచ్చిందన్నదానిపై అప్ డేట్ సమాచారమేమీ లేదు.  

SHARE