నెల్లూరు జిల్లా కోవురూలో ఘోర రోడ్డు ప్రమాదం - MicTv.in - Telugu News
mictv telugu

నెల్లూరు జిల్లా కోవురూలో ఘోర రోడ్డు ప్రమాదం

September 14, 2021

రహదారులు రక్తమోడుతున్నాయి, ప్రయాణీకుల పాలిట మృత్యు కుహారాలుగా మారుతున్నాయి. నెల్లూరు జిల్లా కోవూరు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఎస్సై వేంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు… నెల్లూరులోని హరినాథపురానికి చెందిన  పారపల్లి మహేంద్ర తన కుటుంబంతో కలిసి తన కుమారుడిని తూర్పు గోదావరి జిల్లా తునిలో ఉన్న హాస్టల్ లో చేర్పించి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో కోవూరులోని ఏసీసీ కళ్యాణ మండపం వద్దుకు రాగానే కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది.

దీంతో కారులో ఉన్న మహేంద్ర తండ్రి  పారుపల్లి సుధాకర్ రావు (76),భార్య అపర్ణ(35) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మహేంద్రతో పాటు అతని తల్లి వెంకట సుజాత,కూతురు సిసింద్రీ (6) గాయపడ్డారు. క్షతగాత్రులను నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.