Undavalli Arun kumar press meet about meeting with kcr
mictv telugu

ఏపీలోని 25 మంది ఎంపీలు బీజేపీ ఎంపీలే.. కేసీఆర్‌కు చెప్పిన ఉండవల్లి…

June 13, 2022

Undavalli Arun kumar press meet about meeting with kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఏపీకి చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం ప్రగతి భవన్‌లో భేటీ కావడం పలు ఊహాగానాలకు దారి తీసింది. కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీపై మంతనాలు కోసం, ఏపీ పరిస్థితులు తెలుసుకోడానికి సమావేశమైనట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆదివారం ఏమీ స్పందించని ఉండవల్లి ఈ రోజు భేటీ వివరాలు చెప్పారు. కొన్ని సంచలన విషయాలు కూడా వెల్లడించారు. ఏపీలో బీజేపీనే బలమైన పార్టీ అని, ఆ రాష్ట్రంలోని 25 మంది ఎంపీలను బీజేపీ ఎంపీలుగానే భావించాల్సి ఉంటుందని రాజమండ్రిలో విలేకర్లతో అన్నారు. దేశంలో మోదీని ఎదుర్కోగల నేత కేసీఆరేనని అన్నారు.

‘‘కేసీఆర్ పది రోజుల కిందట స్వ‌యంగా ఫోన్ చేసి పిలిస్తేనే వెళ్లాను. హరీశ్ రావు రిసీవ్ చేసుకున్నారు. భేటీలో కేసీఆర్, హ‌రీశ్‌, ఒక మంత్రి, ఒక ఎంపీ, వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ ఉన్నారు. కిశోర్ వింటూ కూర్చున్నారు తప్ప మాట్లాడలేదు. బీఆర్ఎస్ ప్రస్తావన రాలేదు. మోదీ పాలనపై చర్చించారు. నాకు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. భేటీలో మాట్లాడుకున్నవన్నీ నేను బయటికి చెప్పలేదు…’ అని ఉండవల్లి చెప్పారు.