అనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు. వైసీపీ తన గొయ్యి తానే తవ్వు కుంటోంది అని తెలిపారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం వైసీపీకి మైనస్ అవుతుందని చెప్పారు. రాజకీయాల్లో ఇప్పటి వరకు చంద్రబాబు ఎవరూ అడ్డుకోలేదన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని..ఆత్మహత్యలే ఉంటాయని గుర్తు చేశారు. నాడు కాంగ్రెస్ పార్టీ జగన్‌ను జైలుకు పంపడంతోనే సీఎం అయ్యారని వివరించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర విభజనపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు రాష్ట్రాన్ని విభజించిన దుర్దినం అని తెలిపారు. ఇప్పటికీ విభజన కష్టాలు వెంటాడుతున్నాయని పేర్కొన్నారు. నేటికి విభజన బిల్లు ఆమోదం పొందలేదన్నారు. దీనిపై వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఈనెల 22న విచారణకు వస్తుందని వెల్లడించారు. విభజన హామీలను సాధించడంలో మాజీ సీఎం చంద్రబాబు, తాజా సీఎం జగన్మోహన్ రెడ్డి విఫలం చెందారని అసంతృప్తి వ్యక్తం చేశారు.