మన కుర్రాళ్లు కేక.. అండర్ 19 కప్ మనకే - MicTv.in - Telugu News
mictv telugu

మన కుర్రాళ్లు కేక.. అండర్ 19 కప్ మనకే

February 3, 2018

మౌంట్‌ మాంగనీ: మన కుర్రాళ్లు చరిత్ర సృష్టించారు. అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో కసిదీరా దంచేసి నాలుగోసారి కప్ అందుకున్నారు. పృథ్వీ షా సారథ్యంలో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌.. అన్నింటూ ఆసీస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. ఆసీస్‌ విసిరిన విసిరిన 217 పరుగుల సవాల్‌ను మన పిలగాళ్లు 38.5 ఓవర్లలోనే బద్దలు కొట్టి, 8 వికెట్ల తేడాతో చిందులేశారు.ఓపెనర్లు పృథ్వీషా, మన్‌జోత్‌ కర్లా తొలి వికెట్‌కు 11.4 ఓవర్లలో 71 పరుగులు అందిచారు. పృథ్వీ (21) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరినా మిగతా ఆటగాళ్లు చెలరేగిపోయారు. మన్‌జోత్‌ కల్రా(101 నాటౌట్‌; 102 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు), హర్విక్‌ దేశాయ్‌(47 నాటౌట్‌; 61 బంతుల్లో 5 ఫోర్లు), శుభ్‌మాన్‌ గిల్‌(31) అందించారు. కాగా, అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 216 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. జోనాథన్‌ మెర్లో(76;102 బంతుల్లో 6 ఫోర్లు) చేశారు.  మన బౌలర్లలో పొరెల్‌, శివ సింగ్‌, నగర్‌ కోటి, అనుకూల్‌ రాయ్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. శివమ్‌ మావీ ఓ వికెట్‌ తీశాడు.