under-construction building elevator collapses in Ahmedabad
mictv telugu

ఘోరం.. లిఫ్ట్ కూలి 8 మంది బలి

September 14, 2022

under-construction building elevator collapses in Ahmedabad

నిర్లక్ష్యం, భద్రతాలోపాల వల్ల విలువైన ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. రోడ్లు నిరంతరం నెత్తురోడుతున్నాయి. చివరకు పకడ్బందీ సాగాల్సిన నిర్మాణ పనుల్లోనూ భద్రతా చర్యలు సరిగ్గా లేకపోవడం వల్ల పెను విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. నిర్మాణంలో ఉన్న లిప్ట్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయి 8 మంది కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బుధవారం ఈ దారుణం జరిగింది.

గుజరాత్ యూనివర్సిటీ సమీపంలో నిర్మితమవుతున్న ఓ ప్రైవేట్ భవనంలో ఈ సంఘటన జరిగింది. ఉదయం ఏడుగంటల ప్రాంతంలో ఏడో అంతస్తులోని లిఫ్ట్ కూలిపోయిందని, అయితే యజమానులు పోలీసులకు వెంటనే సమాచారం అందించలేదని వార్తలు వస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.