ఎయిర్‌పోర్ట్ పైకప్పు కూలి వ్యక్తి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఎయిర్‌పోర్ట్ పైకప్పు కూలి వ్యక్తి మృతి

January 25, 2020

Bhubaneswar airport.

గతంలో అమీర్ పేట్ మెట్రో స్టేషన్ పైకప్పు కూలి ఓ యువతి మృతి చెందిన విషయం ఎంత సంచలనం అయిందో తెల్సిందే. తాజాగా భువనేశ్వర్ విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు కూలిన ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. 

భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 1, టెర్మినల్ 2లను కలుపుతూ భవనాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ భవనం పైకప్పు శనివారం ఉదయం కూలింది. ఈ ఘటనలో ట్రక్ హెల్పర్ అంతర్యామి గురు అక్కడికక్కడే మరణించారు. మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన కార్మికుడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అగ్నిమాపకశాఖ అధికారులు వచ్చి కూలిన భవన శిథిలాలను తొలగిస్తున్నారు. భువనేశ్వర్ ఎమ్మెల్యే అనంత జెనా సంఘటన స్థలాన్ని సందర్శించారు.