భూమికి ఏమైంది..? ఏదైనా ప్రళయం ముంచుకొస్తుందా? అనే విధంగా మహారాష్ట్రలో ఓ ఘటన జరిగింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి బద్ధలైంది. ఒక్కసారిగా నీరు ముంచుకొచ్చింది. దీంతో ప్రజలు హడలిపోయారు. చివరికి కారణం తెలిసి షాక్‌కు గురయ్యారు.
కొన్ని క్షణాలు వరకు ఆ రోడ్డు ప్రశాంతంగా కనిపించింది. ఎవరికివారు వాహనాలతో రాకపోకలు సాగిస్తున్నారు.అయితే ఒక్కసారిగా రోడ్డు రెండుముక్కలైంది. అంతేకాదు ఉప్పెనలా నీరు బయటకు ఎగిసిపడింది. ఏం జరిగిందో..జరుగుతుందో తెలియిక ప్రజలు భయంతో పరుగులు తీశారు.అదే సమయంలో స్కూటీపై వెళ్తున్న ఓ మహిళ తీవ్రంగా గాయపడింది.మరికొందరు మాత్రం తృటిలో తప్పించుకున్నారు.
यवतमाळ शहरात जमिनीत झाला स्फोट!, भूमिगत पाईपलाईन फुटली, थरकाप उडवणारा Video एकदा पाहाच…https://t.co/2jrmCKvB4K #Maharashtra #Yavatmal #Video pic.twitter.com/FCwUwIDF63
— LoksattaLive (@LoksattaLive) March 4, 2023
పైప్‌లైన్ బ్లాస్ట్ జరిగినట్లు అధికారులు తేల్చారు. ఈ కారణంగానే భూమి చీలిపోయి భారీగా నీరు వచ్చింది. సెకెన్లలో ఆ రోడ్డంతా జలమయమైంది. సంచలనం రేపిన ఈ ఘటన మహారాష్ట్ర లోని యావత్‌మాల్‌లో జరిగింది. నగరంలో సరైన నిర్వహణ లేని పైప్ లైన్ కారణంగా ఎప్పుడైనా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దృశ్యాలు చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం.