భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
మొత్తం ఖాళీల సంఖ్య: 360
శిక్షణా వ్యవధి: 1 ఏడాది.
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 100
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
స్టైపెండ్:
నెలకు రూ.10,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 260
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
స్టైపెండ్:
నెలకు రూ.11,110ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 13, 2022.
Potal.mhrdnats.gov.in