నిరుద్యోగుల్లారా.. జూన్‌లో గ్రూపు-4 నోటిఫికేషన్ విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

నిరుద్యోగుల్లారా.. జూన్‌లో గ్రూపు-4 నోటిఫికేషన్ విడుదల

May 20, 2022

తెలంగాణలోని 33 జిల్లాల నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్తను చెప్పింది. వచ్చే నెల (జూన్)లో 9,168 గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసిందని, అన్ని సక్రమంగా కుదరితే వచ్చే నెలలో ఉద్యోగ ప్రకటన విడుదల చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.

బీఆర్‌కే భవన్‌లో గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి గురువారం టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బి. జనార్దన్ రెడ్డితో కలిసి సోమేశ్ కుమార్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..”ఇప్పటికే అనుమతించిన పోస్టులతోపాటు మిగతా పోస్టులకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. గురుకుల నియామకాలకు ఏర్పాట్లు చేసుకోవాలి. గ్రూప్-4 ఉద్యోగాలకు అనుమతులు త్వరలోనే ప్రభుత్వం జారీచేయనుంది. ఇప్పటికే గుర్తించిన ఖాళీలను భర్తీ చేసేందుకు వీలుగా విభాగాధిపతులు నోటిఫికేషన్ జారీకి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. జిల్లా స్థాయి పోస్టులు కావడంతో 33 జిల్లాల నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉంది. జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ విభాగాధిపతులు నోడల్ అధికారులుగా వ్యవహరించాలి” అని ఆయన అన్నారు.