నిరుద్యోగులు అలర్ట్.. మే 31వరకే ఛాన్స్ - Telugu News - Mic tv
mictv telugu

నిరుద్యోగులు అలర్ట్.. మే 31వరకే ఛాన్స్

April 27, 2022

తెలంగాణ‌ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలైంది. అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన చేసిన ప్రకారమే సోమవారం అధికారులు పోలీసు శాఖలో నోటిఫికేషన్ విడుదల చేశారు. మంగళవారం తెలంగాణలో తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో నిరుద్యోగులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ విడుద‌ల చేసిన ఈ నోటిఫికేష‌న్ ద్వారా 503 గ్రూప్ 1 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు పేర్కొంది. అంతేకాకుండా గ్రూప్ 1 ఉద్యోగాల భ‌ర్తీలో భాగంగా ఇంట‌ర్వ్యూల‌ను ఎత్తివేస్తున్న‌ట్లు టీఎస్‌పీఎస్సీ త‌న నోటిఫికేష‌న్‌లో ప్ర‌క‌టించింది. కేవ‌లం ప్రిలిమ్స్‌, మెయిన్స్ రాత ప‌రీక్ష‌ల ఆధారంగానే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల విషయంలో అభ్యర్థులకు ముఖ్య విషయాన్ని తెలియజేసింది. మే 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులను కోరింది. ఇక, గ్రూప్ 1లో ప్ర‌కటించిన ఉద్యోగాల్లో కేట‌గిరీల వారీగా ఉద్యోగాల ఖాళీలు ఇలా ఉన్నాయి.

 

1. డిప్యూటీ క‌లెక్ట‌ర్లు 42

2. డీఎస్సీలు 91

3. ఎంపీడీఓలు 121

4. సీటీఓలు 48

5. అసిస్టెంట్ ట్రెజ‌రీ ఆఫీస‌ర్లు 38

6. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీస‌ర్లు 40

7. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు 26

8. మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ గ్రేడ్ 2.. 41

9. అసిస్టెంట్ లేబ‌ర్ క‌మిష‌న‌ర్లు 8

10. ఆర్టీఓ 4

11. జిల్లా పంచాయ‌తీ ఆఫీస‌ర్లు 4

12. జిల్లా రిజిస్ట్రార్లు 5