నిరుద్యోగులు అలర్ట్.. నేడే చివరి తేదీ - MicTv.in - Telugu News
mictv telugu

నిరుద్యోగులు అలర్ట్.. నేడే చివరి తేదీ

May 31, 2022

తెలంగాణ రాష్ట్రంలో గత నెలలో వెలువడిన తొలి గ్రూప్-1 ఉద్యోగాలకు నేటీతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుల గడువు ముగియనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా ఈ ఉద్యోగాలకు ఎవరైతే ఆప్లై చేయలేదో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇక, ఈ గ్రూప్-1 ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి నేటీవరకు ఎంతమంది నిరుద్యోగులు ఆప్లై చేసుకున్నారో ఆ వివరాలను అధికారులు మంగళవారం వెల్లడించారు.

”రికార్డు స్థాయిలో నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు ఆప్లై చేసుకున్నారు. 503 పోస్టులకు సోమవారం రాత్రి 10 గంటల వరకు 2,94,044 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 31 (మంగళవారం) చివరి తేదీ కావడంతో వీటి సంఖ్య 3 లక్షలు దాటే అవకాశముంది. 2011 (ఉమ్మడి రాష్ట్రం)లో 312 పోస్టులతో వెలువడిన గ్రూప్-1 పోస్టులకు 3 లక్షల మందికి పైగా దరఖాస్తులు చేశారు. తాజాగా వెలువడిన గ్రూప్-1 ఉద్యోగాలకు రోజుకు సగటున 10 వేల దరఖాస్తులు వస్తే, సోమవారం ఒక్కరోజే 32 వేలు వచ్చాయి. సర్వర్‌ ఒత్తిడి పెరగకుండా, అభ్యర్థులకు సాంకేతిక ఇబ్బందులు రాకుండా కమిషన్, సీజీజీ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.”

ఇక, ఈ గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్షను జూన్ చివరి వారం లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు మరింత సమయం కావాలని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నుంచి కమిషన్‌కు వినతులు వస్తున్నాయి. గ్రూప్-1 ప్రకటన సుదీర్ఘకాలం తరువాత వెలువడిందని, సన్నద్ధమయ్యేందుకు అవకాశమివ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు.