తెలంగాణలో నిరుద్యోగ భృతికి అర్హతలు ఇవేనా! - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో నిరుద్యోగ భృతికి అర్హతలు ఇవేనా!

October 23, 2018

వచ్చే ఎన్నికల కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టో నిరుద్యోగులకు ఆశాదీపంలా కనిపిస్తోంది. ఏకంగా నెలకు రూ.3,016 ఇస్తామని చెప్పడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. దీన్ని పొందడానికి ఏ అర్హతలు ఉండాలన్న అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగుల భృతికి అనుసరించే విధానంలాంటి దాన్నే దాదాపు అనుసరిస్తారని, కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని చెబుతున్నారు. అయితే దీనిపై తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విధివిధానాలు రూపొందిస్తుందని కేసీఆర్ చెప్పడంతో అప్పటి వరకు ఎదురు చూడాల్సిందేనంటున్నారు.

Expectations on eligibility for unemployment allowance in Telangana as promised by TRS chief KCR election manifesto what is the true picture criteria

 అర్హతలు

మన దేశంలో నిరుద్యోగ భృతి కొత్తదేమీ కాదు.. 1982లో కేరళ ప్రభుత్వం నిరుద్యోగులకు రూ. 180 అందించే పథకాన్ని తీసుకొచ్చింది. ఛత్తీస్‌గఢ్, పంజాబ్ వంటి పదికిపైగా రాష్ట్రాలు భృతి ఇస్తున్నాయి. 500 నుంచి రూ. వెయ్యివరకు ఇస్తున్నారు. దాదాపు అన్ని ప్రభుత్వాలూ ఒక విధానాన్నే అనుసరించినట్టు కనిపిస్తోంది. అవి..

  1. ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేసుకుని ఉండాలి
  2. 18 ఏళ్లు దాటిన తర్వాత కనీసం మూడేళ్లు ఖాళీగా ఉండాలి, గరిష్ట వయో పరిమితి 35 ఏళ్లు
  3. కనీస విద్యార్హత పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి(చాలా రాష్ట్రాల్లో డిగ్రీ అంటున్నారు)
  4. కుటుంబ ఆదాయం, వ్యక్తిగత ఆదాయం నిర్దిష్టంగా ఒక మొత్తంలోపే ఉండాలన్న షరతు
  5. ప్రభుత్వ, ప్రైవేట్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తుండ కూడదు

 

ఆంధప్రదేశ్లో ఇలా

1.కనీస విద్యార్హత గ్రాడ్యుయేషన్, టెక్నికల్ అయితే డిప్లమా

2.వయసు 22 ఏళ్ల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వం నిర్వహించిన ప్రజాసాధికార సర్వేలో నమోదు తప్పనిసరి.

3.పెళ్లయిన మహిళలకు కూడా అర్హతలు ఉంటే భృతి

4.ప్రభుత్వ, ప్రైవేట్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తుండకూడదు

5.కార్లు వంటి 4 చక్రాల వాహనాలున్నవారు అనర్హులు. 2.5 ఎకరాల తడి భూమి 2.5, గరిష్టంగా 5 ఎకరాల భూమి మాత్రమే ఉండాలి.

తెలంగాణాలో

పై అర్హతలను పరిశీలిస్తే తెలంగాణలోనూ దాదాపు వాటినే అర్హతలుగా పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. రాష్ట్రంలో 12 లక్షమందికి భృతి ఇవ్వడానికి యత్నిస్తామని కేసీఆర్ చెప్పడం తెలిసిందే.