అనూహ్యం.. నాటోలో చేరలేమని జెలెన్‌స్కీ ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

అనూహ్యం.. నాటోలో చేరలేమని జెలెన్‌స్కీ ప్రకటన

March 9, 2022

nbgnb

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అనూహ్య ప్రకటన చేశాడు. యుద్ధానికి ప్రధాన కారణమైన నాటో సభ్యత్వాన్ని ఇకపై కోరమని వెల్లడించాడు. ఓ అంతర్జాతీయ మీడియాతో
జెలెన్‌స్కీ మాట్లాడుతూ ‘ యుద్ధం ప్రారంభమైన పక్షం రోజుల తర్వాత నాకు విషయం అర్థమైంది. రష్యాతో పోరాడడానికి నాటో సిద్ధంగా లేదు. పైగా భయపడుతున్నాయి. దీన్ని గుర్తించడం కాస్త ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో నేనే చల్లబడడం మంచిదనిపించింది. నాటోను మేమింక బతిమిలాడదల్చుకోలేద’ని వెల్లడించాడు. అంతేకాక, రష్యా స్వతంత్ర దేశాలుగా గుర్తించిన ఉక్రెయిన్ ప్రాంతాలపై కూడా రాజీ పడాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అయితే ఈ విషయంపై చర్చలు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి దీనికి
రష్యా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.