హ్యాండిచ్చిన ప్రియురాలికి జన్మలో మరచిపోలేని షాకిచ్చాడు... - Telugu News - Mic tv
mictv telugu

హ్యాండిచ్చిన ప్రియురాలికి జన్మలో మరచిపోలేని షాకిచ్చాడు…

June 24, 2022

ప్రస్తుతం సమాజంలో అబ్బాయిలు నిజాయితీగా ప్రేమిస్తారా? లేక అమ్మాయిలు నిజాయితీగా ప్రేమిస్తారా? అనే విషయంలో ఎక్కువ మంది అబ్బాయిలే ప్రేమ విషయంలో చాలా సిన్సియర్‌గా ఉంటారని అమ్మాయిలు సైతం ఒప్పకున్నారు. అయితే, ఓ ప్రేమికుడు ఎంతో ఇష్టంగా ప్రేమించిన తన లవర్ హ్యాండ్ ఇవ్వడంతో ఆమెకు జన్మలో మరచిపోలేని షాక్ ఇచ్చాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో సరైన ఆధారాలేమి లేవుగాని, నెట్టింటి మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి గతకొన్ని సంవత్సరాలుగా తన ప్రియురాలు ఏదీ అడిగిన అది కొనిచ్చాడు. అవసరమైనప్పుడల్లా అడిగినంత డబ్బు ఇచ్చాడు. ఆమె తల్లికి ఆరోగ్యం బాగోలేకపోతే, ఆసుపత్రి ఖర్చులన్నీ భరించాడు. కానీ, ఆమె తల్లి చికిత్స పొందుతూ మృతి చెందింది. అయినా, బాధలో ఉన్న ప్రియురాలిని అతడు వదిలిపెట్టలేదు. ఆమెకు తోడుగా ఉండి అంత్యక్రియల అయిన ఖర్చులన్నీ భరించాడు.

ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఏమైందో ఏమో తెలియదు గాని ఆ అమ్మాయి అతడికి బ్రేకప్ చెప్పింది. సామాన్యంగా లవ్ ఫెయిలు అయితే, అబ్బాయి దేవదాసు అవుతాడు. కానీ మనోడు ఆ అమ్మాయికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. తనను ప్రేమించిన రోజు నుంచి విడిపోయే రోజువరకు ఎంతెంత ఖర్చు పెట్టాడో, ఆ సొమ్మును మొత్తం ఓ డైరీలో భద్రపరిచాడు. ఆ మొత్తం బిల్లులను ఆమెకు పంపించి, పరిహారం చెల్లించాలని అడిగాడు. దాంతో ఆ యువతికి ఆ బిల్లులు మొత్తం చూసి షాక్ అయ్యింది. సుమారు 100 బిల్లులను ఆమెకు పంపించాడు. మొత్తం 72 వేల యువాన్స్ ( అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 8.41 లక్షలు)గా తేలింది. అందులో కొంత కన్సెషన్ ఇచ్చిన అతడు 60, 147,025 యువాన్లు (ఇండియన్ కరెన్సీలో రూ. 7 లక్షలు) బ్రేకప్ బిల్లుగా అదనంగా చెల్లించాలని ప్రియురాలికి కోరాడు.