Unfortunately..Rs.2.18 lakhs Swaha for clicking the dating app.
mictv telugu

పాపం..డేటింగ్ యాప్ నొక్కినందుకు..రూ.2.18 లక్షలు స్వాహా

September 5, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నివాసముంటున్న ఓ వ్యక్తి..ఓ డేటింగ్ యాప్ లింకు నొక్కినందుకు సైబర్ క్రైం నేరగాళ్లు అతడిని నుంచి రూ.2.18 లక్షలు స్వాహా చేశారు. పోలీసులకు చేప్తే, నగ్న చిత్రాలను, ఫోన్ నెంబర్‌ను ఆన్‌లైన్‌లో పెడతామని బెదిరించారు. దాంతో ఆ వ్యక్తి ఏం చేయాలో అర్థంకాక తనలో తాను తీవ్ర ఆందోళన గురై, చివరికి పోలీసులను ఆశ్రయించాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మియాపూర్‌లోని మయూర నగర్‌లో ఉండే వ్యక్తి (32)2020 ఆగస్టులో ఆన్‌లైన్‌లో “లొకాంటో” పేరుతో ఉన్న డేటింగ్ యాప్ లింకు నొక్కాడు. శృతి పేరుతో సైబర్ నేరగాళ్లు చాటింగ్ చేయటం ప్రారంభించారు. శృతి, మోక్ష పేర్లతో మభ్య పెట్టి, యువకుడి నుంచి నగ్నచిత్రాలను సేకరించారు. అనంతరం బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే, నగ్నచిత్రాలను స్క్రీన్ షాట్లు తీసి భార్య, కుటుంబ సభ్యులకు, బంధువులకు పంపిస్తామని బెదిరించారు. నేరుగా ఇంటికొస్తామంటూ ఫోన్లు చేశారు. చివరికి.. కుటుంబాన్ని అంత చంపేస్తామంటూ భయపెట్టారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్, బ్యాంకు ఖాతాల ద్వారా మూడు దఫాలుగా మొత్తం రూ.2.18 లక్షలు గుంజారు.

బాధితుడు ఓ ప్రైవేటు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. డేటింగ్ యాప్ ద్వారా శృతి పేరుతో బాధితుడిని రెండేళ్లుగా వేధించినట్లు పోలీసులు తెలిపారు. మాయ, మాటలతో నమ్మించి, నగ్న చిత్రాలు సేకరించి, సైబర్ నేరగాళ్లు అతడి నుంచి రూ.2.18 లక్షలు గుంజినట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. అయితే, బాధితుడి అడిగిన డబ్బులు పంపించినప్పటికి నేరగాళ్లు.. వ్యభిచార వెబ్‌సైట్లలో అతని ఫోన్ నంబరును కూడా ఉంచారని వివరాలను వెల్లడించారు.