ఢిల్లీలో మళ్ళీ కాల్పుల కలకలం..వారంలో మూడోసారి! - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీలో మళ్ళీ కాల్పుల కలకలం..వారంలో మూడోసారి!

February 3, 2020

mnjh

దేశ రాజధాని ఢిల్లీలో వారంలో వరుసగా మూడోసారి కాల్పులు కలకలం రేపాయి. మొన్న జామియా దగ్గర గోపాల్, నిన్న షహీన్ బాగ్ దగ్గర కపిల్.. తాజాగా జామియా యూనివర్సిటీ దగ్గర మరో ఇద్దరు కాల్పులు జరిపారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిపై ఈ కాల్పులు జరుగుతుండడం గమనార్హం.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు వర్సిటీ ముందున్న రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత స్కూటీపై వచ్చిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు తొలుత ఐదో నంబరు గేటు, తర్వాత ఒకటో నంబరు గేటువద్ద కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపారు.