పన్ను శ్లాబులు మారలేదు.. కానీ మరోలా బాదారు.. - MicTv.in - Telugu News
mictv telugu

పన్ను శ్లాబులు మారలేదు.. కానీ మరోలా బాదారు..

February 1, 2018

తాజా బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిమిని రూ. 5 లక్షలకు పెంచుతున్నారని వచ్చిన వార్తలు నిజం కాలేదు. జైట్లీ ఈ పరిమితుల్లో ఎలాంటి మార్పులూ ప్రతిపాదించలేదు.గత ఆర్థిక సంవత్సరం (2017-18)లో ప్రకటించిన పన్ను శ్లాబులే ఈ ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగనున్నాయి. రూ. 2.5 లక్షల లోపు ఆదాయానికి పన్ను ఉండుదు. సీనియర్ సిటిజన్లకైతే రూ. 3 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. రూ. 2.5 లక్షల నుంచ రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు 5 శాతం పట్టుకట్టాలి. రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల లోపు ఉన్నవారు 20 శాతం, రూ. 10 లక్షల ఆదాయానికి పైన ఉన్నవారు రూ. 30 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే లాంగ్ టర్మ్ కాపిటల్ గెయిన్స్‌ (ఎల్టీసీజీ)పై 10 శాతం పన్ను వడ్డించి వేతన జీవులు, చిన్నస్థాయి మదుపరులైన జైట్లీ పిడుగు వేశారు. మధ్యతరగతి వేతన జీవులు భవిష్యత్తు అవసరాల కోసం దీర్ఘాకాలిక పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఇదివారికి షాకే. ఈ పన్ను అప్పుడే ప్రభావం చూపింది. స్టాక్ మార్కెట్ 400 పాయింట్లు పతనమైంది. ఎల్జీసీజీపై పన్ను మినహాయింపు వల్ల ఏటా రూ. 50 కోట్లకు గండిపడుతున్న నేపథ్యంలో సర్కారు ఈసారి దాన్ని కూడా పన్ను వలలోకి తీసుకొచ్చింది.