చెప్పులు తొడగలేం.. జ్యూసులు తాగలేం.. - MicTv.in - Telugu News
mictv telugu

చెప్పులు తొడగలేం.. జ్యూసులు తాగలేం..

February 1, 2018

బడ్జెట్ అంటే నాయకులు వృద్ధరేటు, ద్రవ్యోల్బణం.. వంటి ఏవేవో చెబుతుంటారు. అయితే సామాన్య జనం దృష్టి అంతా ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయనే దానిపై ఉంటుంది. తాజా కేంద్ర బడ్జెట్ లో సెల్ ఫోన్ల ధరల మోత మోగనున్నట్లు వచ్చిన వార్తలు నిజమే అయ్యాయి.

దేశీ ఫోన్ తయారీ సంస్థల రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జైట్లీ చెప్పారు. అయితే ఫోన్లతోపాటు చాలా నిత్యావసర ధరలను భారీగా పెంచారు. పలు వస్తువులపై కస్టమ్స్ సుంకాలను రెండు మూడు రెట్లకుపైగా పెరిగాయి. చెప్పుల దగ్గర్నుంచి దాహం వేస్తే తాగే జ్యూస్ వరకు పలు వస్తువులపై పన్ను భారం మోపారు.  

ధరలు పెరిగేవి

మోటార్ బైకులు, కార్లు, ట్రక్కులు, వెండి, బంగారం, కొవ్వొత్తులు, చెప్పులు, చెప్పుల విడిభాగాలు, మొబైల్ ఫోన్లు, వాటి విడిభాగాలు, అడాప్లర్లు, చార్జర్ల లోపలి సామగ్రి, ఎల్సీడీ, ఎల్ఈడీ, ఓల్ఈడీ ప్యానళ్లు, దాదాపు అన్నిరకాల వంటనూనెలు, ఫర్నీచర్, వాటి విడిభాగాలు, ఇటుకలు, పింగాణీ పెంకులు, పరుపులు, చాపలు ఇతర బెడ్డింగ్ సామగ్రి, ల్యాంపులు, గోడ గడియారాలు, పిల్లల ఆటబొమ్మలు, గాలిపటాలు, సన్ గ్లాసులు, ఇమిటేటెడ్ జ్యెయెలరీ, ఆరెంజ్ జ్యూస్, ఇతర కూరగాయలతో చేసే జ్యూస్, పర్ ఫ్యూములు, టాయిటెట్ సంబంధ ద్రవాలు, చర్మ, కేశ, గోళ్ల సౌందర్య సాధనాలు, షేవింగ్ సామగ్రి, డియోడ్రెంట్స్, సెంట్ స్ప్రేలు, టాయిలెట్ స్ప్రేల,  పన్ను(టీత్) ఫిక్సింగ్ సామాగ్రి, బస్సుల రేడియల్ టైర్లు, వజ్రాలు, ఖరీదైన రంగురాళ్లు, హైస్పీడ్ డీజిల్, పెట్రోల్, ల్యాంప్స్,  

తగ్గేవి

ముడి జీడిపప్పు, బాల్ స్క్రూలు, సోలార్ టెంపర్డ్ అద్దాలు, వినికిడి పరికరాలు,అన్ బ్రాండెడ్ పెట్రోల్, డీజిల్..