Union Cabinet approves MSP hike for all mandated rabi crops
mictv telugu

రైతులకు కేంద్రం శుభవార్త.. 6 పంటల మద్దతు ధర పెంపు

October 18, 2022

Union Cabinet approves MSP hike for all mandated rabi crops

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. దేశంలో భారీ విస్తీర్ణంలో సాగవుతున్న పంటలకు మద్దతు ధర పెంచింది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీలో భాగంగా మోదీ సర్కారు ఈ చేయూత అందించింది. మంగళవారం ఆర్థిక వ్యవహారాల మంత్రి మండలి సమావేశమై రబీ పంటలకు మద్దతు ధర పెంచింది. ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం..

రబీ సీజన్‌ 2022-23 (జూలై-జూన్‌), మార్కెటింగ్‌ సీజన్‌ 2023-24 కాలానికి కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) పెరిగింది. మసూరు పప్పుకు అత్యధికంగా రూ. 500 పెరిగింది. గోధులకు క్వింటాలుకు రూ.110 పెంచారు. 2021-22లో క్వింటాలు ధర రూ. 2015 ఉండగా తాజా నిర్ణయంతో రూ.2,125కు చేరింది. ఆవాలు క్వింటాలుకు రూ. 400 పెరిగి రూ.5,450కి చేరింది. బార్లీ ధర రూ. 100 పెరిగి రూ. 1735కు, శనగల ధర రూ. 150 పెరిగి రూ. 5335కు చేరింది. మసూర్ పప్పు ధర రూ. 500 పెరిగి రూ. 600కు చేరింది. కుసుమ ధర రూ.209 పెరిగి రూ. 5650కి చేరుకుంది.