Union Finance Minister Nirmala Sitharaman criticized KCR
mictv telugu

ముందిక్కడ సమాధానం చెప్పి తర్వాత దేశమంతా తిరుగు.. కేసీఆర్‌పై నిర్మల ఫైర్

September 1, 2022

Union Finance Minister Nirmala Sitharaman criticized KCR

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తీవ్ర విమర్శలు చేశారు. జహీరాబాద్ బీజేపీ కో ఆర్డినేటర్‌గా నియమితులైన ఆమె.. మూడు రోజుల పర్యటన నిమిత్తం నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డికి వచ్చారు. ఈ సందర్భంగా అప్పులు, కాళేశ్వరం, రుణమాఫీ గురించి పలు ప్రశ్నలు వేశారు. ‘రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో ఉంది. రైతు రుణమాఫీ పూర్తి కాలేదు. విపరీతంగా అప్పులు చేశారు. ఒక్కో వ్యక్తిపై తలసరి అప్పు రూ. 1.20 లక్షలు ఉంది.

బడ్జెట్లో పెట్టకుండా అప్పులెలా చేస్తారు? పరిమితికి మించి అప్పు చేస్తే ప్రశ్నించే అధికారం కేంద్రానికి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ. 38,500 కోట్లయితే అడ్డగోలుగా రూ. 1,20,000 కోట్లకు పెంచి భారీ అవినీతికి పాల్పడ్డారు. కేంద్రం ఇచ్చే పథకాల పేర్లు మార్చి అమలు చేస్తున్నారు. 8 ఏళ్లలో ఉపాధి హామీ పథకం కింద కేంద్రం 20 వేల కోట్లిచ్చింది. బీహార్ వెళ్తే నితీష్ కుమార్ కూడా మీ మాటలు వినలేకపోయారు. ముందు పై ప్రశ్నలకు జవాబు చెప్పి తర్వాత దేశం మొత్తం తిరగండి’ అంటూ మండిపడ్డారు.