‘‘విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు,’’ అని ఉద్యమించి సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈనగాచి నక్కలపాలైనట్లు మారింది. ఈ పరిశ్రమలను అమ్మి తీరాతమని కేంద్రం స్పష్టం చేసింది. అమ్మకం విషయంలో పునరాలోచించే ప్రసక్తే లేదని టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవికుమార్ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో తేల్చి చెప్పింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తిరిగి ఆలోచించమని, ఉద్యోగుల ఆందోళన గురించి తమకు తెలుసని పేర్కొంది. కేంద్రానికి, రాష్ట్రానికి కోట్ల ఆదాయం తెచ్చిపెడుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంటును నిష్కారణంగా అమ్మడానికి కేంద్రం తీవ్ర ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అడ్డుకోవడానికి గట్టి కార్యాచరణకు దిగకపోవడంతో కేంద్రం దూకుడు పెంచింది. ఆనవాయితీయగా పూర్తి చేయాల్సిన నియమామకాలను పెండింగ్ పెడుతోంది. దీంతో తగినంతమంది ఉద్యోగులు లేక ఉత్పత్తి తగ్గుతోంది. 33వేల ఎకరాలలో విస్తరించి ఉన్న వైజాగ్ స్టీల్, భారతదేశంలోని తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం. దీనికి కోట్ల విలువైన భూములు ఉన్నాయి. నిర్వహణ లోపాలు, అప్పుల సాకుతో కేంద్రం దీన్ని అదానీ, అంబానీ వంటి అస్మదీయులకు కట్టబెట్టడానికి కుట్ర పన్నిందనే ఆరోపణలు ఉన్నాయి.