union Government to amend Atal Pension Yojana
mictv telugu

పెన్షన్ స్కీంలో సవరణ చేసిన కేంద్రం.. ఇకపై ఇలాంటి వారు చేరలేరు

August 11, 2022

కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజనలో కీలక సవరణ చేసింది. ఇకపై ఈ పథకం పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉండదు. అంటే ట్యాక్స్ పేయర్స్ ఈ పథకంలో చేరలేరు. కొత్తగా రూపొందించిన ఈ నిబంధన ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఆదాయపన్ను చెల్లించేవారు అక్టోబరు తర్వాత చేరితే ఆటోమేటిక్‌గా ఆ ఖాతా రద్దయిపోతుంది. అందులో జమ అయిన మొత్తం ఖాతాదారుడికి అందజేస్తారు. గ్యారంటీ పెన్షన్ స్కీం అయిన అటల్ పెన్షన్ యోజనను పీఎఫ్ఆర్‌డీఏ నిర్వహిస్తోంది. ఇందులో చేరడానికి 18 నుంచి 40 ఏళ్ల వయసు వారు అర్హులు. ఇందులో చేరినవారికి 60 ఏళ్లు దాటాక ప్రతీ నెలా పెన్షన్ వస్తుంది. కనిష్టంగా రూ. వెయ్యి, గరిష్టంగా రూ. 5 వేల వరకు పెన్షన్ పొందవచ్చు. మనం చెల్లించే చందా ప్రాతిపదికన పెన్షన్ మొత్తం నిర్ధారించబడుతుంది. ఒకవేళ ఆ లోపే చందాదారుడు మరణిస్తే ఆమె భార్యకు 60 ఏళ్లు దాటాక పెన్షన్ అందిస్తారు. ఇద్దరూ మరణిస్తే వారి పిల్లలకు డిపాజిట్ మొత్తాన్ని చెల్లిస్తారు. కాగా, వయసును బట్టి ప్రీమియం మారుతుంటుంది.