హోం మంత్రి అమిత్ షాకు కరోనా నెగటివ్.. - MicTv.in - Telugu News
mictv telugu

హోం మంత్రి అమిత్ షాకు కరోనా నెగటివ్..

August 9, 2020

వారం రోజుల క్రితం ఆగష్టు 2న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కరోనా వైరస్ బారిన పడిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఆయనే ట్విట్టర్ లో తెలిపారు. దీంతో కరోనా సోకిన కేంద్ర మంత్రుల జాబితాలో అమిత్ షా కూడా చేరారు. కరోనా పరీక్షల్లో తనకు పాజిటివ్ అని తెలియగానే తనను కలిసిన వారందరినీ అమిత్ షా అలర్ట్ చేశారు.

‘కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నాను. ఫలితాల్లో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. కానీ, డాక్టర్ల సలహా మేరకు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలి, సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా కోరుతున్నాను.’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. తాజాగా ఆయనకు చేసిన కరోనా పరీక్షల్లో నెగటివ్ అని వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ మనోజ్ తివారి ట్విట్టర్ ద్వారా తెలిపారు