Union Law Minister Kiran expressed concern over the huge fees of lawyers
mictv telugu

లాయర్లు రూ.15 లక్షలు తీసుకుంటే.. పేదల పరిస్థితి ఏంటి?: కేంద్ర న్యాయ మంత్రి ఆందోళన

July 16, 2022

న్యాయవాదులు కక్షిదారుల నుంచి భారీగా వసూలు చేస్తున్న ఫీజులపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. దీని వల్ల పేదలు, సామాన్యులకు న్యాయం దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్థాన్ జైపూర్‌లో జరిగిన 18వ అఖిల భారత లీగల్ సర్వీసెస్ అథారిటీస్ సమావేశంలో పాల్గొన్న ఆయన సభను ఉద్దేశించి ప్రసంగించారు. ‘పేరున్న లాయర్లు ఒక్కో విచారణకు రూ. 10 నుంచి 15 లక్షలు తీసుకుంటున్నారు. ఇంత భారీ ఫీజులను డబ్బున్న వారు భరించగలరు. కానీ, సామాన్యులు, పేదలు భరించగలరా? దీని వల్ల వారికి న్యాయం దక్కట్లేదు. అలాగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాడుకలో లేని 71 చట్టాలను రద్దు చేయబోతున్నా’మని వ్యాఖ్యానించారు. ఇదే సమావేశంలో పాల్గొన్న సీఎం అశోక్ గెహ్లాత్ నుపుర్ శర్మ విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల పట్ల వచ్చిన వ్యతిరేకతపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే అధికార బీజేపీపై విమర్శలు చేశారు.