తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనలేం : కేంద్రం - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనలేం : కేంద్రం

March 23, 2022

17

ధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న విమర్శలకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో పరోక్షంగా స్పందించారు. అస్సాంలో ధాన్యం సేకరణ అంశంపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. పండిన మొత్తం ధాన్యం, బియ్యాన్ని కొనలేమని సమాధానమిచ్చారు. అదనంగా ఉన్న ఉత్పత్తుల డిమాండ్, సరఫరా ఆధారంగా కొనుగోళ్లు ఉంటాయని స్పష్టం చేశారు. అంతేకానీ, ధాన్యం సేకరణ అనేది ఉత్పత్తి ఆధారంగా ఉండదని రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా మొత్తం ధాన్యం సేకరణ ఉండబోదంటూ పరోక్షంగా చెప్పినట్టయింది. కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని విమర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు విషయంలో పీయూష్ గోయల్ తెలంగాణ మంత్రులకు గురువారం అపాయింట్‌మెంట్ ఇచ్చారు. దేశ వ్యాప్తంగా ధాన్యం సేకరణ విధానం ఒకేలా ఉండాలని కేంద్రాన్ని మంత్రులు కోరే అవకాశం ఉంది.