తెలంగాణే ఇవ్వలేదు... కేసీఆర్‌పై కేంద్రమంత్రి భగ్గు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణే ఇవ్వలేదు… కేసీఆర్‌పై కేంద్రమంత్రి భగ్గు

March 24, 2022

hg

తెలంగాణలో పండే ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న కేసీఆర్‌పై కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తుందని, ఎవ్వరి మీదా వివక్ష చూపదని స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం అన్ని రాష్ట్రాల మాదిరి ఎఫ్‌సీఐ ద్వారా రా రైస్ సేకరిస్తున్నామని వెల్లడించారు. అన్ని రాష్ట్రాలూ ఎంతమేర ధాన్యం సేకరించి కేంద్రానికి అందిస్తాయనే విషయంలో వివరాలు ఇచ్చాయన్నారు. కానీ, తెలంగాణ మాత్రం ఇంతవరకూ స్పందించలేదని విమర్శించారు. ఎన్నిసార్లు అడిగినా టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ లేదని తేల్చి చెప్పారు. 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంతోనూ లేని సమస్య తెలంగాణ నుంచే ఎందుకు వస్తుందో ఆలోచించాలని ప్రభుత్వానికి సూచించారు. కేంద్రం చేస్తుంది తప్పైతే తెలంగాణ పక్కనే ఉన్న ఏపీ, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌లతో ఎందుకు గొడవలు లేవని ప్రశ్నించారు.