'112' యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి..కిషన్‌రెడ్డి మనవి - MicTv.in - Telugu News
mictv telugu

‘112’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి..కిషన్‌రెడ్డి మనవి

December 3, 2019

Union minister kishan reddy appealed people to download 112 mobile application

హైదరాబాద్ శివారులో చోటు చేసుకున్న దిశ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. జస్టిస్ ఫర్ దిశా అని దేశమంతా ముక్తకంఠంతో నినాదిస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో దేశవాసుల రక్షణ, ముఖ్యంగా మహిళల రక్షణపై చర్చ జరిగింది. మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రస్తావన వచ్చింది. 

 

ఈ సందర్భంగా కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..”దేశంలోని మహిళలతో పాటు ప్రతి ఒక్కరికీ నేను ఒక్కటే విన్నపం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది దేశవ్యాప్తంగా ఎక్కడైనా వాడుకోవచ్చు. ఈ యాప్ ద్వారా రైల్వే పోలీసులు, సీఐఎస్ఎఫ్ పోలీసులు స్పందిస్తారు. 112 హెల్ప్ లైన్‌ను నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాలకూ నిధులను కూడా విడుదల చేశాం” అని తెలిపారు. ఈ యాప్ అద్భుతంగా పనిచేస్తోందని దీనిని డౌన్‌లోడ్ చేసుకున్న వారు గూగుల్ ప్లేస్టోర్‌లో రివ్యూస్ రాస్తున్నారు.